తన తాతగారు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా, నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకుడు ప్రదీప్ చిలుకూరితో చేస్తున్న తన 21 వ చిత్రం గ్లింప్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు #నందమూరి కళ్యాణ్‌రామ్21 ని నిర్మిస్తున్నారు. ది ఫిస్ట్ ఆఫ్ ఫ్రేమ్ అనే గ్లింప్స్ కళ్యాణ్ రామ్‌ని యాక్షన్-ప్యాక్డ్ గా సరికొత్త గెటప్ లో ప్రజెంట్ చేసింది. వీడియోలో కళ్యాణ్ రామ్ తన పిడికిలిని చూపించడం తన క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా వుంటుందో తెలియజేసింది. వీడియోలో పవర్ ఫుల్ గా కనిపించారు కళ్యాణ్ రామ్. ఈ హై-బడ్జెట్ ఎంటర్టైనర్ విజువల్స్ గ్రాండ్ గా వున్నాయి. ఈ గ్లింప్స్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.
ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటించిన విజయశాంతి చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాకి సైన్ చేశారు. ఇది కర్తవ్యం పాత్ర తరహలో పవర్ ఫుల్ డైనమిక్ పాత్ర కానుంది. ఈ చిత్రంలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. రామ్ ప్రసాద్ డీవోపీ గా పని చేస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. వారి టాప్ క్లాస్ పనితనం గ్లింప్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్.