దుర్గమ్మను దర్శించుకున్న నందమూరి రామకృష్ణ

విజయవాడ: రాష్ట్రానికి, ప్రజలకు ఇకపై అంతా మంచి జరిగేలా ఆశీర్వదించా లని ఎన్టీఆర్‌ కుమారుడు నందమూరి రామకృష్ణ ఆకాంక్షించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను మంగళవారం ఆయన దర్శించుకున్నారు. ఎన్నికల ఫలితాలు కూటమికి సానుకూలంగా రాబోతున్నాయని, ఇకపై ప్రజలకు అంతా మంచి జరగనుందన్నారు. ఐదేళ్లుగా అనుభవిస్తున్న నరకానికి ఈ రోజుతో ముగింపు కలగబోతోందన్నారు. అమ్మవారి చల్లని దీవెనలు రాష్ట్రంపై, ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరిం చారు. కార్యక్రమంలో వీరమాచనేని శివప్రసాద్‌, వల్లూరు కిరణ్‌, సాయిజ్యోతి, పేరేపి ఈశ్వర్‌, పఠాన్‌ హయ్యత్‌ ఖాన్‌, కాలేషావలి తదితరులు పాల్గొన్నారు.