ముగిసిన నందిగం సురేష్ పోలీసు కస్టడీ

మంగళగిరి, మహానాడు: స్థానిక రూరల్ పోలీస్‌ సర్కిల్ కార్యాలయంలో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను రెండు రోజులపాటు పోలీసులు విచారించారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సురేష్ ను మంగళగిరి న్యాయస్థానంలో పోలీసులు హాజరుపరిచారు.

అనంతరం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళారు. అక్కడ నుంచి గుంటూరు జిల్లా జైలుకు తరలిస్తారు. కాగా, మంగళగిరి బైపాస్ లోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయం పై దాడి కేసుకు సంబంధించి ఈనెల అయిదోతేదీన సురేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.