కార్యకర్తల కుటుంబాలకు నారా భువనేశ్వరి భరోసా

తిరువూరులో నిజం గెలవాలి యాత్ర

తిరువూరు, మహానాడు: నిజం గెలవాలి యాత్రలో భాగంగా శనివారం తిరువూరు నియోజకవర్గం తిరువూరు రూరల్‌ మండలం కాకర్ల గ్రామంలో పార్టీ కార్యకర్త కోట విశ్వనాథం కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. విశ్వనాథం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం తిరువూరు పట్టణంలో పార్టీ కార్యకర్త కుంచం సుబ్బారావు కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.