అనకాపల్లి రహదారులు.. అనంతలోకాలకు మార్గాలు

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

ఇది అనకాపల్లిలోని ప్రధాన రహదారి. జగన్మోహన్ రెడ్డి జమానాలో గోతుల్లో రోడ్డు ఎక్కడుందా అని వెదుక్కోవాల్సి వస్తోంది. ఈ రోడ్లపై ప్రయాణిస్తే గర్బిణీలు, వృద్ధులు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. చేతగాని ముఖ్యమంత్రి సిగ్గు,లజ్జా లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు తీయిస్తున్నానని డబ్బాలు కొట్టుకుంటున్నాడు. కాంట్రాక్టర్లకు 1.80లక్షల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టడంతో టెండర్లు పిలచినా ఈ సిఎం మొఖం చూసి రోడ్లు వేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.

నేను పంచాయితీరాజ్ మంత్రిగా పనిచేసిన మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 25వేల కి.మీ.ల సిసి రోడ్లు వేయించాను. భస్మాసురుడు జగన్ పాలనలో 4.10 ఏళ్లుగా రోడ్లపై తట్టమట్టి పోసే దిక్కులేదు. మరో 2నెలల్లో రాబోయే టిడిపి-జనసేన ప్రజాప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పాడైపోయిన రోడ్లన్నింటినీ బాగుచేసేందుకు చర్యలు తీసుకుంటుంది.