మిస్టర్ జగన్.. బాబు కంటే స్పీడుగా తిరుమల కొండెక్కు

-లేకపోతే రామతీర్థం కొండెక్కు చూద్దాం
-అప్పుడు తెలుస్తుంది ముసలోడెవరో?
-ఈ రోజుతో ముసలోడు ఎవరో తేలిపోవాలి
-సీఎం జగన్ ముసలోడు వ్యాఖ్యలపై యువనేత లోకేష్ సవాల్
-వైకాపా సొంత ఎంపీ కొడుకు, భారన్యే కిడ్నాప్ చేశారు
-మాడుగుల శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ సవాల్

మాడుగుల : బాబు హయాంలో అనేక పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగాలు కల్పించాం. నెలకు రెండు సార్లు ఆయన విశాఖకు వచ్చేవారు. నేడు రోజుకో మర్డర్, కిడ్నాప్, భూకబ్జాలు చోటుచేసుకుంటున్నాయి. వైకాపా సొంత ఎంపీ కొడుకు, భారన్యే కిడ్నాప్ చేశారంటే సామాన్యుల పరిస్థితి ఏమిటో ఆలోచించాలి. వైకాపా భూకబ్జాలకు సహకరించలేదని ఎమ్మార్వో రమణయ్యను కొట్టి చంపారు.

జగన్ ప్రతి మీటింగ్ లో ఓ మాట అంటున్నారు. తన తండ్రి వయసున్న వ్యక్తిని ముసలోడు, ముసలోడు అంటున్నారు. ఈ రోజుతో ముసలోడు ఎవరో తేలిపోవాలి. జగన్ బస్సు దిగాలంటే స్టూల్ వేయాలి. కొబ్బరికాయ కొట్టాలంటే ఇద్దరు ఆ రాయి ఎత్తాలి. అప్పుడు నడుం దించకుండా కొబ్బరికాయ కొడతాడు. బైక్ నడపాలంటే ఇటు నలుగురు, అటు నలుగురు పట్టుకోవాలి. ఏకంగా గత ఐదేళ్లుగా ఒక్క గంట కూడా సమీక్ష చేయలేదు. 6 కాగానే ఇంటికి వెళ్లి పడుకుంటాడు.

నేను సవాల్ విసురుతున్నా.. మై డియర్ జగన్.. తిరుపతి కొండనో, రామతీర్థం కొండనో చంద్రబాబు , మీరు కలిసి ఎక్కండి. మీరు ముందు వస్తారో, చంద్రబాబు వస్తారో తేలిపోతుంది. ఎవరు కుర్రాడు, ముసలోడో తేలిపోతుంది. జగన్ కు బాగా ఇష్టమైన బూతులు విని ప్రతిరోజూ పడుకుంటాడు. చంద్రబాబు ని, పవనన్నను, నన్ను బూతులు తిట్టాలని కలెక్టర్లకు, నాయకులకు చెబుతున్నారు. బూతులు తిట్టకపోతే నాయకులకు టికెట్లు కట్. దీంతో తమకు విభేదాలు లేవని, తమకు ఆ సంస్కారం లేదని వారు బయటకు వెళ్లిపోతున్నారు.
.
జగన్ పదేపదే పేదలకు-ధనవంతులకు యుద్ధం అంటున్నారు. లక్ష కోట్లు అక్రమంగా సంపాదించినవాడు పేదవాడా? లక్ష రూపాయలు విలువైన చెప్పులు, వెయ్యి ఖరీదైన వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడే? జగన్ ది అతి ఖరీదైన వాచ్ వేసుకుని తిరిగే పేదవాడు. భారతి సిమెంట్స్, సండూర్ పవర్ ప్లాంట్లు ఉన్న పేదవాడే? నిజమే జగన్ సాక్షి టీవీ, పేపర్ ఉన్న పేదవాడే.

మాడుగుల హల్వా అంటే నాకు బాగా ఇష్టం. టీడీపీ హయాంలో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి మాడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. నేను పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నప్పుడు 202 కి.మీ సీసీ రోడ్లు వేశాం. బీటీ రోడ్లు, సాగు, తాగునీటి ప్రాజెక్టులు నిర్మించాం. పంచాయతీ, అంగన్ వాడీ భవనాలు పెద్దఎత్తున నిర్మించాం. చిన్న పరిశ్రమలను కూడా తీసుకువచ్చాం. రైతుల కోసం ఇన్ పుట్ సబ్సీడీ ఇచ్చి ఆదుకున్నాం.

అయినా 2019లో పాలిచ్చే ఆవును కాదని తన్న దున్నపోతును తెచ్చుకున్నాం. ముత్యాలనాయుడు ని ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆయన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి. ఏపీ ఉపముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తి నియోజకవర్గంలో పనులు ఎలా జరగాలి? ప్రతి గ్రామానికి రోడ్లు ఉండాలి. గత ఐదేళ్లలో ఒక్క రోడ్డు వేయలేదు, గుంత పూడ్చలేదు. ఉపముఖ్యమంత్రి అంటే ఎవరైనా పలుకుతారు. కానీ ఈయన అవినీతి కోసం ఫోన్లు చేస్తారు. అభివృద్ధి నిల్, అవినీతి ఫుల్.

పెద్దఎత్తున గ్రానైట్, ఇసుకను తవ్వేస్తున్నారు. కేంద్రం ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలి అంటే వాటాల కోసం నిధులు పక్కదారి పట్టించారు. ఏ అధికారిని ట్రాన్స్ ఫర్ చేయాలన్నా డబ్బులు ఇవ్వాలి. ప్రతి నెల మైన్ ఓనర్లు, క్వారీ ఓనర్ల దగ్గర నుంచి కోటి రూపాయలు వసూలు చేస్తున్నారు. ఏ కాంట్రాక్టు పనులు జరగాలన్నా సొంత కంపెనీ చేయాల్సిందే.

మీరు గెలిపించినా, గెలిపించకపోయినా మేం ఎప్పుడూ అండగా ఉన్నాం. పక్కనే ఉన్న అయ్యన్నపాత్రుడు, నేను నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశాం. 2024లో టీడీపీ-జనసేన బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాం.