మంత్రి అమర్నాధ్‌కు లోకేష్ కోడిగుడ్డు గిఫ్టు

– ఆయనకు అందించాలని అనకాపల్లి ప్రజలకు పిలుపు
– అనకాపల్లిలో అమర్నాధ్ పరువు తీసిన లోకేష్

అనకాపల్లి : టీడీపీ యువనేత లోకేష్ అనకాపల్లి ప్రజల సమక్షంలో మంత్రి అమర్నాధ్ పరువు తీశారు. మంత్రి అమర్నాధ్ గతంలో చేసిన కోడిగుడ్డు వ్యాఖ్యలకు సింబాలిక్‌గా.. అనకాపల్లిలో జరిగిన శంఖారావం సభలో, లోకేష్ అదే కోడిగుడ్డును ఒక గిఫ్టు బాక్సును చూపిస్తూ.. దీనిని మంత్రికి పంపిస్తున్నట్లు చెప్పి కడుపుబ్బ నవ్వించారు. దీనిని మంత్రికి అందించాలని అనకాపల్లి ప్రజలను కోరారు. లోకేష్ చేసిన ఈ పని స్థానికంగా మంత్రికి ఝలక్ ఇచ్చినట్లయింది.