మంగళగిరికి తొలి యువ ఎమ్మెల్యేగా నారా లోకేష్‌

– 72 ఏళ్ల నియోజకవర్గ చరిత్రలో రికార్డ్‌

మంగళగిరి నియోజకవర్గం ఏర్పడిన నుంచి ఇప్పటివరకూ ఎన్నికైన ఎమ్మెల్యేలలో అతి పిన్న వయస్కుడు నారా లోకేష్‌. 1952లో ఏర్పడిన మంగళగిరి నియోజక వర్గం నుంచి 11 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 12వ ఎమ్మెల్యేగా ఎన్నికైన లోకేష్‌ వయసు 41 సంవత్సరాలు. 1952 నుంచి 2024 వరకూ 16 సార్లు ఎన్నికలు జరగ్గా కొందరు రెండు సార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈ లెక్కన నారా లోకేష్‌తో 12 మంది ఎమ్మెల్యేలుగా పనిచేయగా, అత్యంత చిన్న వయసు వాడిగా నారా లోకేష్‌ మరో రికార్డు నెలకొల్పారు.