శ్రీకాకుళం, మహానాడు: కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రముఖ సినీనటుడు నారా రోహిత్ శనివారం విశాఖ, శ్రీకాకుళం జిల్లాలోని నియోజకవర్గాల్లో పర్యటించారు. మన కోసం మన నారా రోహిత్ కార్యక్రమంలో భాగంగా ఆయన పలాస, ఎచ్చెర్ల, అనకాపల్లి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మాట తప్పి మడమ తిప్పిన జగన్ రెడ్డికి ఎందుక ఓటు వేయాలి? అవినీతి, అరాచకాలకు నిలయంగా మారిన రాష్ట్రాన్ని మనమే కాపాడు కోవాలని పిలుపునిచ్చారు. మెగా డీఎస్సీ అని చెప్పి దగా చేసిన మోసకారి జగన్‌కు బుద్ధి చెప్పాలని కోరారు. జగన్ రెడ్డి నిర్వాకం వల్ల రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోయాయని ధ్వజమెత్తారు. కెరెంటు, పెట్రోల్, డీజిల్, ఆర్టీసీ చార్జీలు, చెత్త పన్నులతో బాదుడే బాదుడుతో పేదలను పిండుతున్నారని విమర్శించారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే సమర్థుడు చంద్రబాబు ఒక్కడేనన్నారు. రావణాసురుడిని అంతం చేయ డానికే మూడు పార్టీల పొత్తు అని స్పష్టం చేశారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.