నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ నామినేషన్‌

నరసరావుపేట, మహానాడు : నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. నరసరావుపేట నియోజకవర్గ ఎన్నికల కార్యాలయంలో ఎన్నికల అధికారి పి.సరోజినికి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. టీడీపీ సీనియర్‌ నాయకులు వేములపల్లి వెంకట నరసయ్య, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మీరావలి ప్రతిపాదిస్తూ నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అరవిందబాబు మీడియాతో మాట్లాడుతూ నరసరావుపేట కూటమి నాయకు లు, కార్యకర్తల మద్దతుతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. నరసరావుపేట నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే వారు తనకు ఓట్లు వేసి గెలిపిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్ర మంలో జనసేన ఇన్‌చార్జ్‌ సయ్యద్‌ జిలానీ, బీజేపీ నాయకులు రంగిశెట్టి రామకృష్ణ, టీడీపీ నాయకులు వేములపల్లి వెంకట నరసయ్య, కపిలవాయి విజయ్‌కుమార్‌, డాక్టర్‌ కడియాల వెంకటేశ్వరరావు, మన్నవ మోహన్‌కృష్ణ, వేల్పుల సింహాద్రి యాదవ్‌, షేక్‌ మీరావలి, కొట్ట కిరణ్‌, న్యాయవాదులు చండ్ర ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.