విజయవాడ, మహానాడు: నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎన్‌ఏఆర్‌ఈడీ సీవో)అమరావతి అధ్యక్షునిగా శ్రీ భ్రమర టౌన్షిప్ అధినేత గళ్ళా రామచంద్ర రావును ఎన్‌ఏఆర్‌ఈడీ సీవో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఎన్‌ఏఆర్‌ఈడీ సీవో జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో కొత్త కమిటీని సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గళ్ళా రామచంద్రరావుకు, కమిటీకి ఎన్‌ఏఆర్‌ఈడీ సీవో బోర్డు గౌరవ సభ్యులయిన వివి నర్సయ్య, జి.పున్నారావు, కే రామకోటేశ్వరరావు, వి. శ్రీనివాసరావు, రాజవరపు రవి, ఎం.ఎం కొండయ్య లు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గళ్ళా రామచంద్రరావు మాట్లాడుతూ…ఎన్‌ఏఆర్‌ఈడీ సీవో అధ్యక్షునిగా తనని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు, ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతి ఒక్కరికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకొని భవిష్యత్తులో ఈ అసోసియేషన్ మరింత అభివృద్ధి చెందే విధంగా పనిచేస్తానని, రాజధాని అమరావతి ప్రాంతంలో అన్ని అనుమతులు ఉన్న అప్రూవుడ్ లే – అవుట్ లు మాత్రమే చేయాలని, అటువంటి లేఔట్లను మాత్రమే ఎన్‌ఏఆర్‌ఈడీ సీవో ప్రోత్సహిస్తుందని గళ్ళా రామచంద్రరావు తెలిపారు. ముఖ్యంగా రాజధాని అమరావతి అభివృద్ధికి ఎన్‌ఏఆర్‌ఈడీ సీవో కొత్త కమిటీ శాయశక్తుల కృషి చేస్తుందని గళ్ళా రామచంద్రరావు తెలిపారు.
కొత్తగా ఎన్నికైన కమిటీ
గళ్ళా రామచంద్రరావు – ప్రెసిడెంట్
ఏ. సాంబశివరావు – ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్
ఎన్ రాంబాబు – జనరల్ సెక్రటరీ
మారం చంద్ర శేఖర్ – ట్రెజరర్
పెద్ది సుబ్బారావు – వైస్ ప్రెసిడెంట్
ఎం.హనుమంతరావు – వైస్ ప్రెసిడెంట్
ఎం. రామకృష్ణ – వైస్ ప్రెసిడెంట్
పి.వి.కే చైతన్య – వైస్ ప్రెసిడెంట్
టి దుర్గాప్రసాదరావు – జాయింట్ సెక్రటరీ
జి.శివ నాగబాబు – జాయింట్ సెక్రెటరీ
అజీమతుల్లా – జాయింట్ సెక్రటరీ
కె వి ఎస్ రామాంజనేయులు – ఈసీ మెంబర్
ఎం.సత్యనారాయణ – ఈసీ మెంబర్
డి.రమేష్ కుమార్ – ఈసీ మెంబర్
కె.కృష్ణ – ఈసీ మెంబర్
జి.కృష్ణ హేమంత్ – ఈసీ మెంబర్
డి.రమేష్ కుమార్ – ఈసీ మెంబర్