– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి, మహానాడు: రాష్ట్రాభివృద్ధే ఎన్డీయే సర్కారు ధ్యేయమని, ఇందులో భాగంగానే మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్ని నెరవేర్చి తీరుతామని, పేదలకు, రైతులకు, మహిళా సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన ముప్పాళ్ల మండలం, ముప్పాళ్ల గ్రామంలో జరిగిన పల్లె పండుగ వారోత్సవాల్లో పాల్గొని, మాట్లాడారు. ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని 20 ఏళ్ళ వెనక్కి నెట్టేశారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అభివృద్ధి పనులకు కూటమి సర్కారు శ్రీకారం చుట్టిందని, ఐదేళ్ల పాటు వైసీపీ విధ్వంస పాలన కొనసాగిన తర్వాత, మళ్ళీ పల్లెలు అభివృద్ధి బాట పడుతున్నాయన్నారు. ముప్పాళ్ల గ్రామంలో రూ.10 లక్షలు, మాదల గ్రామంలో రూ.37 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సిసి డ్రైన్స్, సీసీ రోడ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.