– వాహనాలకు జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు, మహానాడు: విజయవాడ వరద బాధితుల సహాయార్థం గుంటూరు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద “అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్, వెంకటేశ్వర స్వామి గుడి వాకర్స్ అసోసియేషన్” ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల వాహనాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. వరద వలన విజయవాడ వాసులు అనేక కష్టాలు పాలయ్యారని, వీరికి ప్రభుత్వం, స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి తమ దాతృత్వం ను చాటుకుంటున్నారని, ఇదే స్ఫూర్తిగా అనేక మంది ముందుకు వచ్చి సేవాస్పూర్తిని చాటాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.