– ఎమ్మెల్యే ఆంజనేయుల విమర్శ
వినుకొండ, మహానాడు: జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్క కొత్త బస్సు కూడా వినుకొండకు కేటాయించకపోవడం జగన్ డొక్కు పరిపాలనకు నిదర్శనమని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణం ఆర్టీసీ డిపోలో బుధవారం కొత్త బస్సు సర్వీసులు ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి, మాట్లాడారు. ఇప్పటి వరకు 13 కొత్త బస్సులు ప్రవేశపెట్టినట్టు తెలిపారు.
అయిదేళ్ళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక బస్సు కూడా వినుకొండ కు రాలేదని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. చంద్రబాబు రెండు నెలల పరిపాలనలోనే వినుకొండకు 13వ బస్సులు కేటాయించడం ఎంతో అభినందనీయమన్నారు. వినుకొండ డిఎం గా కోటేశ్వర నాయక్ సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారని, గత ప్రభుత్వం లో ప్రయాణీకుల కొరకు మూడుసార్లు ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలపై పెను భారాన్ని మోపారని, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక బస్సు కూడా కొత్త బస్సులు రాకపోవటానికి దురదృష్టకరమన్నారు.
ఆర్టీసీ వారు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్ని రూట్ లకు కొత్త సర్వీస్ ఏర్పాటు చేయాలని, కొత్త సర్వీస్ల కోసం అవసరమైతే ఆర్టీసీ ఎండీని కూడా సంప్రదిస్తానని అన్నారు. కార్యక్రమంలో పట్టణ సిఐ శోభన్ బాబు, వినుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పఠాన ఆయబ్ ఖాన్, పత్తి పూర్ణచంద్రరావు, పల్ల మీసాల దాసయ్య, పీవీ సురేష్ బాబు, వంకాయలపాటి పేరయ్య, కాకాని వీరాంజనేయులు, చికెన్ బాబు, పుండ్లు నరసింహారావు పాల్గొన్నారు.