Mahanaadu-Logo-PNG-Large

అధికారుల నిర్లక్ష్యం.. జాతీయ జెండాకు అవమానం

మహబూబాబాద్, మహానాడు: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎంపీడీఓ కార్యాలయంలో జాతీయ జెండాకు స్వాతంత్య్ర దినోత్సవం రోజు అవమానం జరిగింది. 78 వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో భాగంగా స్థానిక స్పెషల్ ఆఫీసర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జెండా ఎగుర వేసేందుకు సిద్ధమయ్యారు. జాతీయ జెండా పైకి వెళ్ళాక ముడి ఎంతకూ వీడకపోవడంతో బలంగా లాగారు. దీంతో, జాతీయ జెండాకు ఉన్న ముడి వీడి జెండా ఆవిష్కరణ జరిగింది. అయితే, వెంటనే తాడు వదిలేయటంతో జాతీయ జెండా పై నుంచి జారి నేరుగా స్పెషల్ ఆఫీసర్ కాళ్లపై పడి పోయింది. దీనితో వెంటనే పక్కనే ఉన్న సిబ్బంది లాగి మళ్ళీ పైకి ఎగురవేశారు.