జీవీ ఆంజనేయులు
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూనే చంద్రబాబు చేసిన అయిదు సంతకాలతో రాష్ట్రంలోని ప్రతి లోగిలో కొత్త సంతోషాలు విరబూశాయన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా వైకాపా చేస్తోన్న దుష్ప్రచారాలకూ ఈ సంతకాలతో చెంపపెట్టులాంటి సమాధానం చెప్పినట్లైందన్నారు. ఆర్థికంగా, పరిపాలనపరంగా ఎన్నో సవాళ్లున్నా ఇచ్చిన మాట ప్రకారం మొదటిరోజు అలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమన్నారు జీవీ.
ఈ మేరకు శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారాయన. అయిదేళ్ల క్రితం జగన్ అనే ఒక సైకోకు అధికారం ఇస్తే ప్రజా వేదిక కూల్చివేతతో తన పాలన ప్రారంభించి, రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడని, ఇప్పుడు చంద్రబాబు సంక్షేమ సంతకంతో నవశకానికి నాంది పలికారన్నారు. ఒక అరాచకవాదికి, దార్శనికుడిగా మధ్య తేడా అదే అన్నారు జీవీ. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా తెరుచుకోనున్న అన్నక్యాంటీన్ల ద్వారా పూటకు 5 రూపాయలతోనే నిరుపేదల ఆకలితీరుతుందన్నారు. ఈ సంక్షేమం, ఉపాధికి ఊతమిచ్చిన సంతకా ల అనంతరం ప్రభుత్వం దృష్టిపెట్టాల్సింది గడిచిన అయిదేళ్ల అవినీతి, అక్రమాలపై అన్నారు జీవీ. తెలుగుదేశం పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు విడుదల చేసిన ఛార్జ్‌షీట్ ప్రకారమే ముఖ్యమంత్రి జగన్ అండ్ గ్యాంగ్ అయిదేళ్ల వైకాపా పాలనలో 8 లక్షల కోట్ల ప్రజాధనం లూటీ చేశారని, అందులో ప్రతి పైసా ఇప్పుడు కక్కించాల్సిన అవసరం ఉందన్నారు.