ఢిల్లీ : జూన్ 1 నుంచి దేశంలో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. రేపటి నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్డీవో ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ స్కూల్‌కు వెళ్లి లైసెన్స్‌కు అర్హత సాధించవచ్చు. ఇక మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబ డితే రూ.25 వేల వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు..ఆధార్ కార్డు ఫ్రీ అప్డేట్ గడువు జూన్ 14తో ముగియనుంది.