తెలంగాణలో వచ్చే రెండు రోజులు వర్షాలే!

ఏపీలో ఈదురుగాలులు 

హైదరాబాద్, మహానాడు: ఋతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల, ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. బుధ, గురువారాల్లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే అవకాశం ఉందన్నారు.

హైదరాబాద్ లో వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. గాలులు 20 నుంచి 30 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ, పశ్చిమ – నైరుతి దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 08 – 12 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.

ఏపీలో వాతావరణం ఇలా..
‘‘షీర్ జోన్ లేదా గాలుల కోత భారతీయ ప్రాంతంపై సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 7.6 కిలో మీటర్ల ఎత్తు వద్ద సుమారుగా 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి వ్యాపించి ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపునకు వంగి ఉంది’’ అని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.