ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్‌రావు
హైదరాబాద్: నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మూడునెలల పెండిరగ్ జీతాలు చెల్లించాలని ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్‌రావు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడునెలలుగా వారికి జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని తెలిపారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంట ర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ తదితర 78 విభాగాలలో పనిచేస్తున్న 17,541 మంది జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ప్రతినెలా 1వ తేదీనే జీతాలు చెల్లిస్తు న్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు ఒట్టి డొల్ల అని చెప్పడానికి ఇది మరో నిదర్శనమని తెలిపారు.