అనంతపురం, మహానాడు : అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఈ తనిఖీలు జరిగాయి. బెంగళూరులో నివాసం ఉంటున్న అబ్దుల్ కుమారులు గత కొంతకాలంగా కనిపించకుండా పోయారు. వారికి ఉగ్రవాదులతో సంబంధాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో అధికా రులు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో నాగుల బావిలోని తండ్రి అబ్దుల్ ఇంటిని నిశితంగా పరిశీలించారు.