కార్యకర్త కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ
తిరువూరు, మహానాడు: నిజం గెలవాలి యాత్రలో భాగంగా తిరువూరు నియోజకవర్గం ఎ.కొం డూరు మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో పార్టీ కార్యకర్త గుగులోతు బాబ్ల (70) కుటుంబాన్ని నారా భువనేశ్వరి శుక్రవారం పరామర్శించారు. చంద్ర బాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో ఆయన మృతిచెందగా బాబ్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల ను ఓదార్చి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.