Mahanaadu-Logo-PNG-Large

ఫోన్‌ ట్యాపింగ్‌పై బీజేపీ దీక్షలకు నిరంజన్‌రెడ్డి స్పందన

-రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌
-చిత్తశుద్ధి ఉంటే రైతుల కోసం చేయండి
-హామీలను పక్కదారి పట్టించేందుకే దీక్షలని వ్యాఖ్య

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌పై దీక్షలు చేపట్టిన బీజేపీ పార్టీ తీరుపై  మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అయిందని వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలు దేశంలో శత్రువులు ..తెలంగాణలో మిత్రులని అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ గురించి బీజేపీ దీక్షలు…  కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల హామీలను పక్కదారి పట్టించేందుకేనని తెలిపారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలుకు బీజేపీ దీక్షలు ఎందుకు చేయదు? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ది ఉంటే రైతుల కోసం దీక్షలు చేయాలి. రాష్ట్రంలో తాగునీళ్లు లేక రోడ్డెక్కుతున్న ఆడబిడ్డల కోసం దీక్షలు చేయాలి. రుణమాఫీ అమలు కోసం దీక్షలు చేయాలి. రైతుభరోసా ఎకరాకు 15 వేలు, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేల కోసం దీక్షలు చేయాలి. ప్రతి మహిళకు ప్రతినెలా రూ.2500, బాలికలకు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, ల్యాప్‌టాప్‌లు, నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ, జాబ్‌ క్యాలెండర్‌ గురించి దీక్షలు చేయాలని హితవుపలికారు.