– తెలంగాణలో 17 సీట్లలో పోటీ చేస్తాం
– నారాయణ పేటలో జరుగుతున్న విజయ సంకల్పయాత్ర లో భాగంగా నారాయణ పేటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
విజయ సంకల్పయాత్ర ద్వారా కార్యకర్తలను నాయకులను ప్రజలను వివిధ వృత్తుల వారిని అన్ని రకాల వర్గాలను కలవడం జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రలను ప్రారంభించడం జరిగింది. మొదటి యాత్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కృష్ణ గ్రామం నుండి ప్రారంభం కాగా రంగారెడ్డి జిల్లా తాండూర్ నుండి మరో యాత్ర ప్రారంభమైంది. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బాసర నుండి ఇంకో యాత్ర ప్రారంభమైంది. నాలుగో యాత్ర యాదగిరిగుట్ట నుంచి ప్రారంభించడం జరిగింది. మేడారం జాతర జరిగే ప్రాంతంలో మరో యాత్ర ఉంటుంది.
తెలంగాణలో త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 17 సీట్లు గెలవాలి లక్ష్యంతో ముందుకెళ్తుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఎజెండా వెళ్తుంది. ఆ పార్టీకి ఒక్క సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం ఏమీ లేదు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అహంకారము అవినీతి కుటుంబ పాలనను మాత్రమే చూశాను. కేసీఆర్ కుటుంబం పై బీఆర్ఎస్ పార్టీపై తెలంగాణలో విపరీతమైన వ్యతిరేకత ఉంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది. కరెంట్ బిల్లులు, వ్యవసాయ రుణాల మాఫీ విషయంలో కాంగ్రెస్ మాట తప్పింది. ఆరు గ్యారంటీలు విషయంలో కాంగ్రెస్ మాట తప్పింది. సోనియా కుటుంబం మెప్పు కోసమే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం పని చేస్తుంది. కేసీఆర్ కూడా 10 ఏళ్ల పాటు కుటుంబ పాలన మాత్రమే చేశాడు. తెలంగాణలో 17 సీట్లు గెలిచి, రాహుల్ ప్రధాని అయితే, ఆరు గ్యారంటీలకు ఢిల్లీ నుండి డబ్బులు తీసుకొస్తామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి అంటున్నాడు.
ఆలోచన లేకుండా ఆరు గ్యారంటీల హామీ ఇచ్చారు. కేసీఆర్ అవీనితిని కాంగ్రెస్ ప్రశ్నించడం లేదు. చార్జ్ షిట్ ఎందుకు వేయడం లేదో ముఖ్యమంత్రి చెప్పాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే. ఈ రెండు పార్టీలు ప్రజలను దగా చేసే పార్టీలే. కాంగ్రెస్ పార్టీ రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించింది. శ్రీరామున్ని కాంగ్రెస్ పార్టీ అవమానించింది.
ఇప్పుడున్న 40 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. పేద వర్గాలకు రైతులకు కావాల్సినవి అన్ని కూడా మోడీ ప్రభుత్వం అందిస్తుంది. ఎవరితో బీజేపీతో పొత్తు ఉండదు.
తెలంగాణలో 17 సీట్లలో పోటీ చేస్తాం.