మహాలక్ష్మీ లేదు.. మహారాజు లేదు

– మక్తల్ రోడ్ షో లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

మక్తల్ : 2013లో తెలంగాణ సాధనకోసం ఇక్కడనుండే ప్రారంభించిన పోరు యాత్ర తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించింది. అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణలో కూడా మార్పు రావడమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర చేస్తున్నాం.

నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని సమర్థించాలని ఆకాంక్షిస్తున్నా. నరేంద్ర మోదీ మూడవ సారి ప్రధాని కావాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటున్నారు. దేశంలోని అనేక రకాల సమస్యలను పరిష్కరించారు. ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదవాడికి న్యాయం జరగలేదు. తొమ్మిదేళ్లు కేసీఆర్ కుటుంబం రాష్ట్నాన్ని దోచుకుంటే..ఇప్పుడు రాహుల్ గాంధీ తెలంగాణను దోచుకొని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఖర్చు పెట్డడానికి వాడుతున్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీకి ట్యాక్సీ కడుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతి, కుంభకోణాలే. కాంగ్రెస్ పార్టీ అంటే కుటుంబ పాలన. తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అలవి కానీ హామీలు ఇచ్చారు. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కరెంటు బిల్లులు కట్టొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇంతవరకు అతీ గతీ లేదు. నేను రాగానే రైతులకు రుణమాఫీ, ఎకరానికి రూ.15,000 మహిళలకు రూ.2500 అని చెప్పారు. మహాలక్ష్మీ లేదు.. మహారాజు లేదు..వాళ్లు మాత్రం కుర్చీలో కూర్చున్నారు.