– మాజీమంత్రి ప్రత్తిపాటి
చెప్పింది చేసే చిత్తశుద్ధి, పేదల కష్టాలను పట్టించుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎవరు సాటి లేరు, రారన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. అన్నమాట ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు దస్త్రాలపై సంతకం చేయడమే అందుకు నిదర్శనమన్నారు. వాటితో పాటు పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన దస్త్రాలపై సంతకాలతో అయిదేళ్ల తన పాలన పేదల సంక్షేమం, యువతరం సాధికారితకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వనున్నారో స్పష్టమైన సంకేతాలిచ్చారన్నారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాలను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని, ఇదేస్ఫూర్తితో కూటమి ప్రభుత్వం నుంచి ప్రజలకు మంచి చేసే మరెన్నో నిర్ణయాలు రానున్నాయని అన్నారు ప్రత్తిపాటి. డీఎస్సీ ఆశావహుల కష్టాలు, కన్నీళ్లను దగ్గరగా చూసిన వ్యక్తిగా చంద్రబాబు 16వేలకి పైగా పోస్టులతో మెగా డీఎస్సీని విడుదల చేయడంతో నిరుద్యోగుల్లో ఒక పండగల వాతావరణం నెలకొందన్నారు. అలానే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుతోప్రజల్లో తమ భూములు, ఆస్తులు భద్రం అనే భావన కలిగించారన్నారు. అన్నింటికీ మించిన పింఛన్ల పెంపుతో అవ్వాతాతలు, విక లాంగులకు పెద్ద కొడుకుడుగా కొండంత అండగా నిలిచారరని, అన్నక్యాంటీన్ల పునరుద్ధరణ ద్వారా పేదల ఆకలి తీర్చే మంచి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించి మనసున్న పాలకుడిగా చంద్రబాబు అందరి మన్ననలు పొందుతున్నారన్నారు.