విత్తనాల షాపు ముందు నో స్టాక్‌ బోర్డులు

పంట సాగుకు ముందే కొరత
రైతులకు తప్పని అగచాట్లు

హైదరాబాద్‌, మహానాడు : రైతులకు విత్తనాలను సకాలంలో సరఫరా చేయాలని మంత్రి తుమ్మల ఆదేశిం చినా పరిస్థితి మరోలా ఉంది. విత్తనాల కోసం రైతుల అగచాట్లు తప్పడం లేదు. పంట సాగుకు ముందే విత్తనాల షాపు ముందు నో స్టాక్‌ బోర్డులు దర్శన మిస్తున్నాయి. రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. విత్తనాలు దొరుకకపోవడం తో సోమవారం అదిలాబాద్‌లో ఆందోళనకు దిగారు. దీంతో విత్తన దుకాణం ఎదుట పోలీసు పహారా కూడా ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ వస్తే పాత రోజులు వస్తాయని కేసీఆర్‌ చెప్పిన మాటలు ఒక్కొక్కటిగా నిజం అవుతున్నాయని అంటున్నారు.