అరుంధతి రాయ్‌కు ఇక నోబెల్ అవార్డే తరువాయి..

అరుంధతి రాయ్‌కు పెన్ ప్రింటర్ ప్రైజ్ వచ్చింది. ఈ దేశ రాజ్యాంగానికి, సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా పేలాపన చేసిన అరుంధతి రాయ్‌పై దేశంలో చట్టపరమైన విచారణ మొదలైన తరుణంలో ఆమెకు విదేశీ పెన్ ప్రింటర్ ప్రైజ్ వచ్చింది!

లోగడ ఆమెకు బూకర్ బహుమతి వచ్చింది. ఆ బహుమతితో ప్రాచుర్యంలోకి వచ్చి ఆమె దేశ వేర్పాటువాద శక్తుల్లో భాగమవడం మనం చూశాం. కాశ్మీర్ నరమేధాన్ని, కాశ్మీర్ హిందూ మహిళల మానభంగ ఘట్టాన్ని ఒక మహిళగా ఖండించకపోగా, ఆ దారుణాల్ని చేసిన విదేశీ మతోన్మాదుల్ని ఆమె సమర్థించడం టీ.వీ. చానళ్లలో మనం విన్నాం. ఆమె లోగడ శిక్షను అనుభవించిన నేరస్థురాలు- ఇదీ మనకు తెలిసిన నిజమే.

దేశవ్యతిరేక ప్రవర్తన ఫలితంగా అరుంధతి రాయ్‌పై న్యాయ విచారణ జరుగుతున్న సందర్భంలో ఆమెకు మరో విదేశీ పురస్కారం రావడం అప్రమత్తమై ఆలోచించాల్సిన విషయం. అరుంధతి రాయ్‌కు ఈ విదేశీ పెన్ ప్రింటర్ ప్రైజ్ రావడం భారతదేశ వ్యతిరేక ఎకో సిస్టమ్ పని తీరు ఏమిటో, ఎలా ఉంటుందో మనకు తెలియజేస్తోంది.

ప్రస్తుత్తం జరుగుతున్న విచారణలో పోలీస్ ఆమెను ఖైదు చేస్తే అరుంధతి రాయ్‌కు నొబెల్ బహుమతి కూడా వస్తుందా? ఒక వేళ అరుంధతి రాయ్ నేరస్థురాలు అని తేలితే, ఒకవేళ ఆమె అరెస్ట్ ఐతే భారతదేశ వ్యతిరేక ఎకో సిస్టమ్ సమర్థవంతంగా పనిచేసి, ఆమెకు నోబెల్ పురస్కారం వచ్చేట్టు చేస్తుందని మనం ఆశించవచ్చు. అమర్త్యా సేన్‌కు వచ్చినట్టుగా అరుంధతి రాయ్‌కు నోబెల్ కూడా తప్పకుండా వస్తుందేమో?

– రోచిష్మాన్
9444012279