22న కన్నా లక్ష్మీనారాయణ నామినేషన్‌

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి, మహానాడు: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 22న ఉదయం 10 గంటలకు సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకు కన్నా క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక తహసీల్దారు కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని టీడీపీ సీనియర్‌ నాయకులు అబ్బూరు మల్లిబాబు, దరువూరి నాగేశ్వరావు ఒక సంయుక్త ప్రకటనలో కోరారు.