స్ట్రాంగ్‌రూమ్‌ల దగ్గర పనిచేయని కెమెరాలు

ఎన్నికల అధికారికి టీడీపీ ఎంపీ అభ్యర్థి ఫిర్యాదు
వివరణ ఇవ్వాలని పర్యవేక్షకుడిపై సీరియస్‌

నంద్యాల: పాణ్యం అర్జీఎం కాలేజ్‌లో రెండు స్ట్రాంగ్‌రూమ్‌ల దగ్గర సీసీ కెమెరాలు పనిచేయలేదు. నంద్యాల, డోన్‌ నియోజకవర్గాలకు సంబంధించి స్ట్రాంగ్‌రూమ్‌ల దగ్గర సీసీ కెమెరాలు పనిచేయడం లేదని అధికారులు గుర్తించారు. దీనిపై జిల్లా ఎన్నికల అధికారికి టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షకులపై ఎన్నికల అధికారి సీరియస్‌ అయ్యారు. ఎందుకు పని చేయడం లేదో వివరణ ఇవ్వాలంటూ అధికారులకు అదేశాలు జారీ చేశారు.