తప్పటం లేదు..

బాబుగారు మానసికంగా అత్యంత ధైర్యవంతుడు
ఈయన క్లిష్ట సమయంలో ఒక సామాన్య కార్యకర్తగాను… నిర్ణయకర్త గాను వ్యవహరించ గల నేర్పరి.
డార్విన్ సిధ్దాంతమైన మనుగడకోసం పోరాటం, తన ప్రస్థానంలో కూడా తప్పదని ఒక మెట్టుదిగిన సర్దుబాటు మనస్తత్వం కలవాడు.
సామాన్య ప్రజలను ఆకట్టుకొనేంత మాటలమాంత్రికుడు కాదు. ఆ గారడీ ఆయనకు రాదు.
ఎందుకంటే ఈయన చేతలమనిషి
ఈయన ఎవరిని కించ పరచరు..కానీ ప్రస్తుత రాజకీయాల్లో ఇదే జగన్ దిశా నిర్దేశమవటం వలన కొంత ఆబాటలో ప్రయాణిస్తున్నారే కానీ తనని కించ పరిచిన వాళ్ళని కూడా జాలిగా, కాలానికి వదిలేసే వ్యక్తి ఆయన.
ఈయన పిరికి వాడు కాదు….కానీ కొద్ది భయస్తుడు, అదీ బహుశా అలిపిరి సంఘటన కొంత నేర్పిచిందేమో ! స్వతహాగా. ఈయన దమ్మున్నవాడు ….

కృష్ణ భగవానుడు చెప్పినట్టు……

మరణం శరీరానికే గానీ ఆత్మకు కాదు అన్నట్టు , ఇంతటి స్థితప్రజ్ఞుడిని బాహ్యప్రపంచల్లో నడిచే క్షుద్రశక్తులు , భూతవైద్యాలు ఆయన ఆత్మని తాకవు. శరీరానికే తాకేది……
ఏ అవమానాలు.. ఏ హేళనలు… ఏ వ్యక్తిత్వహననాలు ఈయన్ని ఏమీ చేయలేవు….చేయవు తాకను కూడా తాకలేవూ.

ఈయన తెలుగు దేశం జండా పట్టినప్పటి నుంచి ఒకే ఎజెండా…
అదే ప్రజల ఎజెండా..
మిగతావన్ని ఆయన ముందు బలాదూర్. తలవంచాల్సిందే!కాలానికో,ఖర్మానీకో దొరికిపోయి….. 40 ఏళ్ల నుంచీ ఎంతోమందికి అర్థం కాని ఈయన…జగన్ పుణ్యమా అని అన్ని వర్గాల ప్రజలకు (క్లాస్ కి మాస్ కి ) ఐదేళ్ల నుంచీ పెద్దబాలశిక్షలా .. ఆక్స్ఫర్డ్ నిఘంటువు లా అందరికీ అర్థమవుతున్నారు….

థ్యాంక్యూ జగన్ (కేవలం ఇతని తొందరపాటు చేష్టే చాలా మందిని ఫేమస్ చేసింది).

ఒక్కసారి ఆయన్ని కలసి అర్థం చేసుకునే దిశగా మాట్లాడితే ఆయన ఏంటో అర్థం అవుతారు….

ఆయన ఒక నిబ్బరం..నిశ్చలం
తామరాకు మీది నీటి బొట్టు
ప్రతి వాళ్ళకీ వాళ్ల నడవడికను బట్టి ఏదొక ప్రత్యేక పదం సూట్ అవుతుంది.
ఈ రాజకీయ ఎవరెస్టు శిఖరానికి సరిపడే పదం నా స్ఫురణకు అందటం లేదూ…మీకు తెలిస్తే చెప్పండి.
ఆ పదం మనల్నీ మన వ్యక్తిత్వాన్ని కూడా బయటేస్తుంది. మరవకండి మిత్రులారా!!

యత్ భావం తత్ భవతి

– శృతి