-నా మాదిగ జాతికి అవమానం…
-జరగబోయే పరిణామాలకు రేవంత్ దే బాధ్యత
-సరిచేసుకోకుంటే మూల్యం తప్పదు
-అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా ఆగౌరపరిచారు
-అయినా కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తి లేదు
-మాదిగలకు అన్యాయంతో 17 నియోజకవర్గాల్లో నష్టం
-సర్వేలన్నీ బోగస్..కడియం శ్రీహరి ఓటమి పక్కా
-నేడు న్యాయం కోసం ఒక్కరోజు దీక్ష
-మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు
హైదరాబాద్, మహానాడు: టికెట్ రాలేదని బాధ లేదని, నా జాతికి అవమానం జరుగుతోందన్న బాధ కలుగుతుందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వటం కాదు, ఎటువంటి న్యాయం జరుగుతుందో ఆలోచించాలని హితవుపలికారు. ఇది దళిత జాతికి అవమానమని, సరిచేసుకోకపోతే మూల్యం తప్పదని హెచ్చరించారు. తాను కాంగ్రెస్‌లోనే ఉంటా నని పార్టీ మారే ఉదేశం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు అన్యాయం జరుగుతోందని, మా జాతి హక్కు మాకు ఇవ్వటం లేదని, పార్టీలో అంటరాని వారిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ రెండేసి టికెట్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇచ్చిందని ప్రశ్నించారు.
అటెండర్ పోస్టులు ఇచ్చి గొప్పగా చెప్పుకుంటున్నారు. మందకృష్ణ మాదిగ మాట్లాడిన దాంట్లో తప్పు లేదు..మా పార్టీకి నష్టం జరగాలని నేను మాట్లాడటం లేదు..గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రు లను చూశా…ఎప్పుడూ మాదిగలకు అన్యాయం జరగలేదన్నారు.
కడియం శ్రీహరి ఓడటం పక్కా
మాదిగలకు అన్యాయం వల్ల 17 నియోజకవర్గాల్లో పార్టీకి నష్టం జరగబోతోంది. కడియం శ్రీహరి ఏ కులమో ఆయనకే తెలియదు..అయన ఓడిపోవడం పక్కా అని వ్యాఖ్యలు చేశారు. ఒక్కో కుటుం బంలో ఇద్దరిద్దరికి టికెట్ ఇచ్చారు..మాదిగ వాళ్లు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వ్యక్తిని నేను..నా మాటకు గౌరవం లేదు..ఇంతవరకు సీఎం అపాయింట్‌మెంట్ లేదని…జరగబోయే పరిణామాలకు రేవంత్‌రెడ్డిదే బాధ్యత అంటూ హెచ్చరిం చారు. జితేందర్ రెడ్ది ఇంటికి పోయి రాత్రికి రాత్రికి పార్టీలో చేరిన వెంటనే పదవి ఇచ్చారు. మేము మాదిగలమే అన్న చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మాదిగ జాతి పార్లమెంటుకు పోవొద్దా… మేము మాట్లాడొద్దా?
రాహుల్, సోనియా గాంధీ చెప్పేది ఒకటి..ఇక్కడ జరిగేది ఒకట. సర్వేలు అన్నీ బోగస్, ముఖ్యమం త్రి ఎవరికి అనుకుంటే వారికి టికెట్ వస్తుంది. ఇప్పటికైనా తేరుకోకపోతే పార్టీకి నష్టం కలుగు తుంది. రేపు ఇదే అంశంపై ఒక్కరోజు దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు.