వేధిస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారా?
ఎంతోమందికి సేవలందిస్తున్న తమపై దుష్ప్రచారమా…
తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలి
వైసీపీ తీరుపై ఎన్‌ఆర్‌ఐ నేతల నిరసన
మంగళగిరి, మహానాడు : మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఎన్‌ఆర్‌ఐలను వేధిస్తూ అవమానిస్తున్న వైసీపీ తీరును నిరసిస్తూ టీడీపీ ఎన్‌ఆర్‌ఐ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ సాయి మాట్లాడుతూ సేవా కార్యక్ర మాల్లో బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న ఎన్‌ఆర్‌ఐలను కించపరుస్తారా? అంటూ మండిపడ్డారు. గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు తమపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాం. దేశ ప్రగతికి, అభ్యున్నతికి, ఆర్థిక ప్రగతికి ఎన్‌ఆర్‌ఐలు ఎంతో దోహదపడుతున్నారు. సేవా కార్యక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. గుంటనక్కల్లా గ్రామాల్లోకి వచ్చారు అం టూ వైసీపీ నేతలు అవమానించడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమని మండిపడ్డారు. సామాజిక మాద్య మాల ద్వారా ఎన్‌ఆర్‌ఐల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. ఇటువంటి దుష్ప్రచారం చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. సామాజిక మీడియాల్లో వైసీపీ నాయకులు చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
అబద్ధం ప్లస్ బురద..ఈక్వెల్ టు వైసీపీ పార్టీ అని రుజువు చేసుకున్నారు. ఎన్‌ఆర్‌ఐలు అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. వైసీపీ ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్ ద్వారా చేసిన సేవల కంటే.. ఎన్‌ఆర్‌ఐలు చేసిన సేవా కార్యక్రమాలు ఐదు రెట్లు ఎక్కువ. కొవిడ్ సమయంలో ఆక్సిజన్ సిలెండర్లు సరఫరా చేశాం. కుల మతాలు చూడలేదు. అలాంటి వారిని కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు. మేం ఎప్పుడైనా సహాయం చేయడానికి సిద్ధం. తమ మాతృభూమికి సేవ చేయాలని ప్రతి ఎన్‌ఆర్‌ఐకి ఉంటుంది. కష్టాలు పడుతున్న వారిని ఆదుకోవడానికి ముందుంటారు. రోడ్ యాక్సిడెంట్లు, జరగరాని విపత్తులు జరిగినప్పుడు స్పందించి సహాయం చేస్తుంటారు. అటు వంటి ఎన్‌ఆర్‌ఐలను వైసీపీ నేతలు కించపరచడం భావ్యమా? అంటూ ప్రశ్నించారు. ఇటువంటి భాష మాట్లాడొద్దని వైసీపీ నాయకులకు మనవి చేస్తున్నాం. ఆస్ట్రేలియా, యూరప్ లలోని తెలుగు ప్రజలకు ఎటువంటి కష్టమొచ్చినా సరే ఈ ఐదేళ్లలో చాలా సాయం చేశాం. ఇలాంటి కామెంట్లు ఆపేయాలి… వైసీపీ నాయకులు చేసిన కామెంట్లు వెనక్కి తీసుకుని వెంటనే ఎన్‌ఆర్‌ఐ కమిటీకి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. టీడీపీ అధికారంలోకి వచ్చాక అనేక దేశాల నుంచి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి తీసుకరావ డానికి కృషి చేస్తాం. ఎన్‌ఆర్‌ఐల ఆత్మగౌరవాన్ని వైసీపీ నేతలు దెబ్బతీయొద్దు. ఇప్పటిదాక ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన విధానాన్ని ప్రజలకు వివరిస్తాం. వారికి ఎటువంటి ప్రభుత్వం వస్తే బాగుంటుందో వివరిస్తాం. ప్రజలకు సహాయం చేస్తాం. వైసీపీ వ్యవహారం దారుణం. ఎన్‌ఆర్‌ఐలను రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి వైసీపీ అడ్డుపడుతోంది. వైసీపీ చేసే ఇలాం టి కామెంట్లతో వారు వెనక్కి తగ్గే ప్రమాదం ఉంది. దయచేసి వైసీపీ ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి.
ఎవరు ఏ పార్టీకైనా మద్దతిచ్చుకునే స్వేచ్ఛ ఉంది…
ఎన్‌ఆర్‌ఐ సతీష్ మాట్లాడుతూ ఎన్నారైలను గుంటనక్కలని మాట్లాడడం తగునా? కించపరచి మాట్లాడటం భావ్యం కాదు. ఎన్‌ఆర్‌ఐలు గుంటనక్కలు కాదు దేశ సేవకులు. దేశం, రాష్ట్రం బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలని కాంక్షిస్తుంటాం. తామంతా రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనుకుంటాం, చేస్తున్నాం. ఒక కులానికి, మతానికి సంబంధించిన వారం కాదు. వారు వివిధ పార్టీల్లో సానుభూతి పరులుగా ఉంటారు. అన్ని పార్టీల సానుభూతిపరులు ఉన్నట్లే వైసీపీలో, టీడీపీలో కూడా ఉంటారు. మా మనోభావాలు దెబ్బతిన్నందున మేం మీడి యా ముందుకు వచ్చి మాట్లాడాల్సి వచ్చింది. వైసీపీ నాయకులు కనీసం వైసీపీ ఎన్‌ఆర్‌ఐ లకన్నా గౌరవమివ్వండి. టీడీపీ ఎన్‌ఆర్‌ఐలను కించపరిచి మాట్లాడటాన్ని వైసీపీ ఎన్నారైలు ఖండిరచాలి. ఇటువంటి భాష తమపై వాడొద్దు. రాజకీయాలలో వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేసుకునే హక్కు ఉంటుంది. మాకున్న అభిప్రాయం, మాకున్న అభిమానం వేరు. ప్రతి పార్టీకి ఎన్‌ఆర్‌ఐల సపోర్టు ఉంది. ఇప్పటికైనా వైసీపీ మాట్లాడిన భాష వెనక్కి తీసుకోవాలి.
వైసీపీ నాయకులు రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐలకు క్షమాపణ చెప్పాలి
ఎన్నారై నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ సాక్షి పత్రికలో తమను గుంటనక్కలనడం భావ్యం కాదు. వైసీపీ నాయకులు వారి భాషను మార్చుకోవాలి. ఐదేళ్లుగా వైసీపీ నాయకుల నోటి నుంచి వచ్చే మాటలు మాద్యమాల్లో మాత్రమే చూశాం. మీడియాలో విన్నాం. ఇప్పుడు రాష్ట్రానికి వచ్చి ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎన్‌ఆర్‌ఐలను గుంటనక్కల మంద అనడం బాగోలేదు. కొవిడ్ సమయంలో టీచర్‌లకు, గుడి పూజారులకు గ్రోసరీలు అందించాం. ప్రజలందరూ బాగుండాలని యజ్ఞ యాగాదులు చేశాం. రాష్ట్ర ప్రజలు బాగుండాలని తపన పడ్డాం. వైసీపీ నాయకులకు ధైర్యముంటే గ్రామాలకు రండి ఎవరు గుంట నక్కలో తేల్చుకుం దాం. అనేక బస్ షెల్టర్లు నిర్మించాం. అనేక దేవాలయాలు నిర్మించాం. అనేక వృద్ధాశ్రమా లను ఎన్‌ఆర్‌ఐలు కట్టించారు. వాటికి దాతలు విరాళాలిచ్చారు. ఇంతటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎన్‌ఆర్‌ఐలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి.