ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పేదలకు వరం

-ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెల ఒకటో తేదీనే ఇంటి వద్దకే పింఛన్లు అందజేస్తున్నారని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం ఎనిమిదవ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలతో కలసి పాల్గొని లబ్దిదారులకు పింఛన్లు స్వయంగా అందజేసారు.

ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, ఎన్టీఆర్ భరోసాతో నిరుపేదలకు, నిరాశ్రయులకు ఆర్థిక భరోసా చేకూరుతుందన్నారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాగానే పింఛను మూడు వేల నుండి నాలుగు వేలకు పెంపు చేయడం, పింఛన్లు ప్రతినెల మొదటి తారీకునే అందజేయడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీకి అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. మొదటి రోజునే నూరు శాతం పింఛన్ల పంపిణీకి కృషి చేయాలని సంబంధిత సచివాలయ సిబ్బందికి తంగిరాల సౌమ్య సూచించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎటువంటి ఆలస్యం లేకుండా పెన్షన్లను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయిస్తున్నట్లు స్పష్టం చేసారు.