Mahanaadu-Logo-PNG-Large

న్యూయార్క్‌ టైంస్క్వేర్‌పై ఎన్టీఆర్‌ చిత్రమాలిక

న్యూయార్క్‌ టైంస్క్వేర్‌పై ఎన్టీఆర్‌ చిత్రమాలిక ప్రదర్శితమైంది. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మొట్టమొదటి సారిగా 200 అడుగులు ఎత్తు, 36 అడుగులు వెడల్పు తో ఎన్టీఆర్‌ చిత్రాలను ప్రదర్శించడం తెలుగువారికి దక్కిన గౌరవమని తెలిపారు.

అమెరికా కాలమానం ప్రకారం మే 27న అర్ధరాత్రి నుంచి మే 28 అర్ధరాత్రి వరకు 24 గంటల పాటు ప్రతి 4 నిమిషాలకు ఒకసారి 15 సెకన్ల చొప్పున ‘అన్న ఎన్టీఆర్‌’ చిత్రమాలికను ప్రదర్శించారు.