` ఆర్.కృష్ణయ్య వేసిన పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకోలేదు?
` సుప్రీంకోర్టులో కేసు ఇంకా కొనసాగుతోంది
` ఆర్థిక, సామాజిక వెనుకబాటు ప్రాతిపదికనే రిజర్వేషన్లు
` ముస్లిం రిజర్వేషన్లను కాపాడిరది చంద్రబాబే
` ఈ అంశం ఆర్టికల్ 16 ప్రకారం రాష్ట్ర పరిధిలోనిది
` టీడీపీ నేత, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్
మంగళగిరి, మహానాడు : ముస్లింలకు మత ప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషిన్ వేసింది వైసీపీ ఎంపీ ఆర్.కృష్టయ్య కాదా అని సీఎం జగన్‌ను ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ప్రశ్నించారు. మంగళగిరి తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో కృష్ణయ్యతో పిటిషన్ వేయించారు. ఆ కేసు సుప్రీంకోర్టులో నడుస్తోంది. 4 శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు వారిని ఓబీసీలుగా పరిగణించి ముస్లింలకు ఇవ్వలేదని, మతపరమైన రిజర్వేషన్లు కాదన్నారు. ముస్లింలు సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనంతో ప్రజాస్వామ్యయుతంగా వచ్చాయని వివరించారు. ముస్లింలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. ముస్లింలలో అత్యధిక శాతం విద్య, ఉపాధి, ఆరోగ్య, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. అందుకోసమే రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇది రాజ్యాంగం ఆర్టికల్ 16 సబ్ క్లాజ్ 4 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది.
ముస్లిం వ్యతిరేకి ఆర్.కృష్టయ్యకు ఎంపీ పదవి ఇచ్చారు…
ముస్లిం వ్యతిరేకి అయిన ఆర్.కృష్టయ్య ను తెలంగాణ నుంచి తీసుకొచ్చి ఎంపీ పదవి కట్టబెట్టింది జగన్ కాదా? ముస్లింలకు వ్యతిరేకంగా ఇది మా ఓబీసీ, బీసీల రిజర్వేషన్‌కు దెబ్బతీస్తుందని చెప్పి వాదించారు. దానిపై కోర్టుకు వెళ్లారు. చంద్రబాబు పాలనలో నేను మైనార్టీ కమిషనర్‌గా, సెక్రటరీగా పనిచేశాను. ఆ సమయంలో చంద్రబాబు ముస్లింల రిజర్వేషన్ల పరిరక్షణ కోసం రూ.5 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించారు. సుప్రీం కోర్టులో ప్రముఖ లాయర్లను పెట్టారని గుర్తుచేశారు.
వైసీపీ ఎందుకు పిటిషన్ వెనక్కి తీసుకోలేదు
ఆర్.కృష్ణయ్యకు చెప్పి రిజర్వేషన్ రద్దుకు వేసిన పిటిషన్‌ను ఎందుకు వెనక్కుతీసుకోవడం లేదు. దీనికి సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు జవాబు చెప్పాలి. అందరు ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఇవ్వలేదు. కేవలం వెనుకబాటుతనం ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. సయ్యద్, మహమ్మద్, పఠాన్‌లకు 4 శాతం రిజర్వేషన్ ఇవ్వలేదన్నారు. ముస్లింలంతా టీడీపీకి అండగా ఉన్నారన్న అక్కసుతో రిజర్వేషన్లపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు.
పక్క రాష్ట్రాల్లో సానుకూలత
పక్క రాష్ట్రం కర్నాటక 4 శాతం రిజర్వేషన్ బదలాయిస్తామంది. సుప్రీంకోర్టు దాన్ని తప్పుపట్టింది. దాంతో దానిని ఆపింది. తమిళనాడులో 68 శాతం దాటి ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. 9వ షెడ్యూల్‌లో చేర్చారు. అక్కడ 3.5 శాతం రిజర్వేషన్ ఉంది. కేరళలో 8 శాతం రిజర్వేషన్ ఉంది. మొన్న మరాఠాలకు రిజర్వేషన్ 50 దాటినప్పుడు నీలం సాహ్ని కేసులో 50 శాతం రిజర్వేషన్ దాటకూడదని చెప్పినప్పుడు సుప్రీం కోర్టు కలుగజేసుకుంది. ముస్లింలు రిజర్వేషన్లపై అపోహపడాల్సిన పనిలేదని, ముస్లిం రిజర్వేషన్లు నాడు కాపాడిరది చంద్రబాబే…ఆయనే ఇప్పుడు కూడా కొనసాగిస్తారని వివరించారు.