హైదరాబాద్, మహానాడు: సచివాలయం ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పరిశీలించారు. ఈ నెల 20న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సచివాలయం ముందు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే విగ్రహ ఏర్పాటు పూర్తైనందున ల్యాండ్ స్కేపింగ్, ఇతర పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రులు ప్రాంగణ మ్యాప్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు.