వన మహోత్సవ ఏర్పాట్ల పరిశీలన

– నేడు నరసరావుపేటకు రానున్న సీఎం, డిప్యూటీ సీఎం

నరసరావుపేట, మహానాడు: పట్టణంలో నేడు జరుగు వన మహోత్సవం విజయవంతమయ్యేందుకు అవసరమైన ఏర్పాట్లను పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ గురువారం పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ విచ్చేయనున్నారు. ఇక్కడి జేఎన్‌టీయూ కళాశాలలో వన మహోత్సవం నిర్వహించనున్నారు. కళాశాలలోని సభా స్థలాన్ని ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి, పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, తదితర టీడీపీ ముఖ్య నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడారు.

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జేఎన్‌టీయూ కి శంకుస్థాపన చేశారు.. అదే జేఎన్‌టీయూ కళాశాలలో ఇప్పుడు వన మహోత్సవం జరగడం శుభ పరిణామం. గ్రామాలు, పట్టణాల నుంచి ఇటీవల విపరీతమైన కాలుష్యం వెలువడుతోంది. రాబోయే తారలు బాగుండాలి అంటే కాలుష్యం పూర్తిగా తగ్గించాలి. పచ్చదనంపై చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ దృష్టి పెట్టాలి. రాబోయే యువతరం బాగుండాలనేదే తెలుగుదేశం పార్టీ, సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్ష. వన మహోత్సవం కార్యక్రమాన్ని మన నరసరావుపేటలో ప్రారంభించడo జిల్లాకి దక్కిన అరుదైన గౌరవం. కాగా, ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టా కిరణ్, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు కుమ్మెత కోటిరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్ బాబు, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మద్దిరాల గంగాధర్, గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.