బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్
హైదరాబాద్: దేశంలో రాజకీయ కుట్రలకు నిజాయితీ గల అధికారులు బాధితులు అవుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదుతో ఏపీ మాజీ సీఎం జగన్, సీనియర్ ఐపిఎస్ అధికారులు సునీల్ కుమార్, అంజనేయులుపై ఎఫ్ఐఆర్ నమోదవ్వడం షాక్‌కు గురిచేసిందన్నారు. గోధ్రా మారణహోమంలో న్యాయం వైపు నిలిచిన సంజీవ్ భట్ ఏళ్లుగా జైల్లో నే ఉన్నారని గుర్తుచేశారు.