అమరావతి, మహానాడు: నల్ల బజారుకు తరలిస్తున్న ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. 550 క్వింటాల రేషన్ బియ్యం, రెండు లారీలను స్వాధీనం చేసుకుని, నిందితుడు బాపట్ల జిల్లాకు చెందిన చీమకుర్తి సుధాకర్, కర్ణాటక కు చెందిన సలవుద్దీన్ అను అరెస్ట్ చేశారు. రేషన్ మాఫియా తరలింపులో గుంటూరు పట్టణానికి చెందిన వ్యాపారి హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రముఖ రేషన్ మాఫియా వ్యాపారి కోసం నల్గొండ పోలీసులు గుంటూరు కు వెళ్ళారు. పట్టుకున్న రేషన్ బియ్యం విలువ 18 లక్షల రూపాయల విలువ ఉంటుందని ఎస్పీ శరత్ కుమార్ తెలిపారు. రేషన్ బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్ కు తరలిస్తున్నట్టు విచారణలో వెల్లడయింది.