పూరీ శ్రీక్షేత్రంలో సేవలకు ఓంఫెడె నెయ్యి

పూరి, మహానాడు: పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో ‘ఓంఫెడ్’ నెయ్యి దీపాలు మాత్రమే వెలిగించాలి. మహాప్రసాదం (ఒబడా), ఇతర ప్రసాదాలన్నింటికీ దీనినే వినియోగించాలి. ఇతర కంపెనీల నెయ్యి స్వామి సేవలకు వినియోగించరాదు అని ఆలయ పాలనాధికారి అరవిందపాడి స్పష్టం చేశారు. కల్తీకి తావులేని ఓంఫెడ్ నెయ్యి మినహా ఇతర కంపెనీల నెయ్యి ఉపయోగించొద్దని సేవాయత్లకు పాలనాధికారి ఆదేశించారు. పూరీలో ఈమేరకు ఓంఫెడ్ నెయ్యిడిపో ప్రారంభించాలని కోరారు.