ఎంతమంది దేవుళ్లపై ప్రమాణం చేస్తారు?

– ఓట్ల కోసం రేవంత్‌ కోడ్‌ ఉల్లంఘిస్తున్నారు
– ఆయన భాష అభ్యంతరకరం
– పవర్‌ మినిస్టర్‌కు పవర్‌ లేదంటే…
-సామాన్యుల సంగతి ఏంటి?
– పైరవీలకు అడ్డాగా కార్యాలయాలు
– బీఆర్‌ఎస్‌ నేత కె.పి.వివేకానంద

హైదరాబాద్‌, మహానాడు: బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే కె.పి.వివేకానంద ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావే శంలో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి బహిరంగ సభల్లో అభ్యంతరకర భాషను వాడుతున్నారు. ఇచ్చిన హామీలు, గ్యారంటీలు మరిచి మోసగించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎంపీ స్థానాలు గెలవకపోతే సీఎం కుర్చీ పోతుందని రేవంత్‌రెడ్డి భయపడుతున్నారు. ఆగస్టు నెలలో రైతు రుణమాఫీ చేస్తామని మహబూబాబాద్‌, మెదక్‌ సభల్లో దేవుడిపై ప్రమాణం చేశారు.

అలా ఓట్లు అడగడం అంటే ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందికి వస్తుంది. 420 హామీలు నెరవేర్చడా నికి రేవంత్‌ రెడ్డి ఎంతమంది దేవుళ్లపై ప్రమాణం చేస్తారని ప్రశ్నించారు. ఆయన ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని తొక్కి సీఎం అయ్యారు. రేవంత్‌ను వి.హెచ్‌, సర్వే సత్యనారాయణ, మోత్కుపల్లి నర్సింహులు వ్యతిరేకిస్తున్నారు. రేవంత్‌రెడ్డి కరెంటు తీగ అయితే ఫీజులు ఎగిరిపోతాయని కౌంటర్‌ ఇచ్చారు. రేవంత్‌ చేసేది ఓట్ల జాతరని విమర్శిం చారు. రాష్ట్రంలో ప్రజలు సాగు, తాగునీరు, కరెంటు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భట్టి విక్రమార్క ఆదివారం సీపీఐ ఆఫీస్‌కు వెళితే అక్కడ అరగంట పాటు కరెంటు పోయింది.

పవర్‌ మినిస్టర్‌కు పవర్‌ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి బీజేపీలో చేరుతారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ అంటున్నారు. పార్టీ కార్యకర్తలను కాపా డుకునే ప్రయత్నం రేవంత్‌ రెడ్డి చేస్తున్నారు.

హోల్‌సేల్‌గా అమ్మేయడం ఖాయం
గాంధీ భవన్‌కు తాళం వేసి ఇంటి నుండే అన్ని వ్యవహారాలు నడుపుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీని రేవంత్‌ హోల్‌ సేల్‌గా అమ్మేస్తారు. ప్రజా సమస్యల పేరుతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పిలిపిం చుకుని కాంగ్రెస్‌ కండువా కప్పే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, గడ్డం రంజిత్‌రెడ్డిపై కాంగ్రెస్‌ పార్టీ క్యాడర్‌ తిరుగుబాటు చేస్తోంది. హైదరాబాద్‌ నగరంలో రియల్‌ ఎస్టేట్‌ కుదేలయింది. బిల్డర్లకు పర్మిష న్లు ఎందుకు ఆపుతున్నారు. సెక్రటేరియట్‌, ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమంత్రి నివాసం పైరవీలకు అడ్డాగా మారింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఎలాంటి పైరవీలు లేవు. ముదిరాజ్‌ ఎమ్మెల్యే మీ పార్టీలో ఉన్నా ఇప్పటివరకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదో సమాధానం చెప్పాలి. ఎన్నికల్లో ఓట్లు వేస్తేనే ముదిరాజ్‌ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ బస్సు యాత్రతో మంచి ఫలితాలు వస్తాయని, హైదరాబాద్‌ నగరంలో కేటీఆర్‌ రోడ్‌ షోలు ఉంటాయని వివరించారు.