15న రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం

– మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ

అమరావతి, మహానాడు: రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్ల తో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్,డైరెక్టర్ హరి నారాయణన్,ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆ వివరాలివి. అన్న క్యాంటీన్లు ఏర్పాటు,డ్రైన్ లలో పూడిక తొలగింపుపై కమిషనర్లకు పలు సూచనలు… పలు ప్రాంతాల్లో క్యాంటీన్ భవనాలు నిర్మాణం జరుగుతున్న తీరును పరిశీలన.. డ్రైన్ లలో పూడిక తీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు. ఈ నెల 15 న రాష్ట్రంలో 100 అన్న క్యాంటీన్ లు ప్రారంభిస్తున్నాము. 33 మున్సిపాలిటీల్లో 100 క్యాంటీన్లు ఏర్పాటు. రాబోయే వారం రోజులు అన్న క్యాంటీన్ లపై కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. క్యాంటీన్ భవనాల్లో కిచెన్ ఏర్పాటు చేసే టీమ్ తో సమన్వయం చేసుకోవాలి.