-వెంకట్రామరెడ్డిపై దుష్ప్రచారం సరికాదు
-బీజేపీపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం
-మాజీ మంత్రి హరీష్‌రావు
నర్సాపూర్, మహానాడు: నర్సాపూర్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్‌రావు మాట్లాడారు. బీఆర్ఎస్ కంచుకోటలో మరోసారి గెలుపు ఖాయమన్నారు. ఒకరి మతంతో, మరొకరు కులంతో పోటీకి వస్తే మేము చేసిన అభివృద్ధిని చూపుతూ వస్తున్నామని వ్యాఖ్యానిం చారు. దుబ్బాకలో చెల్లని రూపాయి ఇప్పుడు మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో చెల్లుతుందా అని ప్రశ్నించారు. ఒక్కసారి గెలిపిస్తే ఎందుకు గెలిపించామని ప్రజలు బాధపడ్డారు. వెంకటరామ రెడ్డిపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. దేశంలోనే బెస్ట్ ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మిం చారు. మంచి ప్యాకేజీ ఇచ్చారు. మండుటెండలో గోదావరి నీళ్లు గలగల పారాయి. లక్షల ఎకరాల్లో పంట పండిరది అంటే దాని వెనుక వెంకట్రామరెడ్డి చెమట చుక్కలు ఉన్నాయి. ఆయన నీళ్లు ఇవ్వడం తప్పు అయితే ఓడిరచండి. మంచి అయితే గెలిపించండని కోరారు. వడ్లు కొనాలి అంటే నూకలు బుక్కుర్రి అని బీజేపీ వాళ్లు అన్నారు. పీయుష్ గోయల్ ఏం ముఖం పెట్టుకొని తెలంగాణలో ఓటు అడిగేందుకు వచ్చావు. బీజేపీ రైతులకు చేసిన ఒక్క మేలు ఉందా రఘునందన్ సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.