– ప్రభుత్వ వాయిజ్యసముదాయాల నిర్వాహణలో కొందరి తీరుపై మంత్రి సీరియస్
– నెల్లూరు కార్పోరేషన్ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ నిర్వహించిన మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
– నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో అద్దెకు ఇచ్చిన 223 ప్రభుత్వ వాయిజ్య సముదాయాలు
– అసలైన పాటదారులు లేకపోవడంతో ఇటీవల 52 షాప్‌లు సీజ్ చేసిన అధికారులు
– సమగ్ర డేటా సేకరించి త్వరలో అందరికీ న్యాయం చేస్తామన్న మంత్రి నారాయణ
నెల్లూరు: మున్సిపాలిటీ, కార్పొరేషన్ల పరిధిలోని ప్రభుత్వ దుకాణాలను ఒకరు పాటపాడుకుని దక్కించుకుంటే… మరొకరు రాజకీయబలంతోనే, రౌడీయిజంతోనే వారి వద్ద నుంచి బలవంతంగా లాక్కుంటున్నారని, ఇది మంచి పద్దతి కాదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మండిపడ్డారు.
నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో ఈ మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజతో కలిసి ఆయా శాఖల అధికారులతో మంత్రి నారాయణ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. సీజ్ చేసిన దుకాణాలపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ నారాయణ మాట్లాడుతూ మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టి రెంట్‌లకు ఇవ్వడం అనేది సాధారమన్నారు. దానిద్వారా ప్రభుత్వానికి కొంతమేర ఆధాయం చేకూరుతుందని తెలిపారు. నెల్లూరు మున్సిపాలిటీలో 223 షాపులను రెంట్‌కు ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఈ షాపులను ఒకరు దక్కించుకుంటే, మరోకరు రాజకీయ బలంతోనే, రౌడీయిజంతోనే లాక్కుంటున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. దానిపై అధికారులు దాడులు నిర్వహించి 52 షాపులను క్లోజ్ చేసినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో పలువురు తనను సంప్రదించడంతో… ఆ విషయమై చర్చించేందుకు మున్సిపల్ అధికారులతో రివ్వూ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 20, 30 ఏళ్ల నుంచి ఆ షాపుల్లో ఉంటున్నవారిని వెళ్లిపో అనడం న్యాయం కాదని, అయితే 2011లో వచ్చిన 56, 68 జీవో ప్రకారం చట్టంలో ఆ మాదిరిగా లేదన్నారు. అయితే దీనిపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించామని తెలిపారు. ఏళ్ల తరబడి ఆ షాపుల్లో ఉంటున్నారన్నారు.
రాష్ట్రంలో ఇదేవిధంగా ఉన్న అన్నీ షాపుల్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారని, తదితర వివరాలను వచ్చే నెల 15వ తేదీ లోపు సమగ్ర డేటాతో సేకరించామని చెప్పామన్నారు. అనంతరం ఎమ్మెల్యే, అన్నీ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.
న్యాయబద్దంగా ఉంటూ అదేషాపుల్లో వ్యాపారాలు చేసుకునేవారికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. మరో రెండు నెలల్లో ఈ విషయమై సమగ్ర నివేదికతో అందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి నారాయణ తెలియజేశారు.