వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా కష్టమే

కేబినెట్‌లో 40 మంది మంత్రులు ఓడిపోతున్నారు
ఘోర పరాజయం తప్పదు..జగన్‌ మాటల్లో ఓటమి భయం
భారీ మెజార్టీతో కూటమి అధికారంలోకి రావడం ఖాయం
జగన్‌ మాఫియా దోచుకున్న సొమ్ము మొత్తం కక్కిస్తాం
అరాచక వైసీపీ నేతలు, అధికారులను జైలుకు పంపిస్తాం
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

అమరావతి, మహానాడు : జగన్‌ రెడ్డి మాటలే వైసీపీకి ఓటమిని స్పష్టం చేశాయని, దాన్ని కప్పిపుచ్చి కార్య కర్తలను మభ్యపెట్టేందుకు సజ్జల ప్రయత్నిస్తూ మీడియా ముందు అబద్ధాల ప్రచారాలకు తెరలేపాడని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం విలేఖరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. జగన్‌రెడ్డి మాటలను వైసీపీ కార్యకర్తలు నమ్మడం లేదు. నేడు పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేశారని ఏపీ గోబెల్స్‌ సజ్జల అసత్య ప్రచారానికి తెరలేపాడు. ముఖ్యమంత్రి లండన్‌ పారిపోతున్నాడు. పెద్దిరె డ్డి పీఎల్‌ఆర్‌ కంపెనీ వెహికిల్స్‌ ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు తరలిస్తున్నా రు. సజ్జల సొల్లు కబుర్లు ఎవరూ నమ్మరు. కేఏపాల్‌ కాన్ఫిడెన్స్‌ ఎలా ఉందో జగన్‌రెడ్డి కాన్ఫిడెన్స్‌ కూడా అంతేస్థాయిలో ఉందని సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ కూడా స్పష్టం చేస్తున్నాయి. ఇకనైనా పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని హితవుపలికారు.

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టే వైసీపీకి ఉరితాడు

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టే వైసీపీని ముంచింది. తాత ముత్తాతలు ఇచ్చిన భూము లను కొట్టేయాలని, దోచుకోవాలని చేసిన చట్టమే వైసీపీకి ఉరితాడు అయింది. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటు ఫలితమే జనసునామీ. వైసీపీ 40 మంత్రుల్లో ఒక్కరు కూడా దైర్యంగా మీడియా ముందుకు వచ్చి గెలుస్తామని మాట్లాడటం లేదు. వారందరూ ఓడిపోబోతున్నారు.