ఉప ముఖ్యమంత్రి భట్టి
సమర్థించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, మహానాడు : వైఎస్సార్ అంటే సంక్షేమం, వైఎస్సార్ ఆశయం అంటే అభివృద్ధి, వైఎస్సార్ లక్ష్యం అంటే ఈ దేశమంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. వైఎస్సార్ ను అభిమానించే నాయకులంతా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. మనమంతా దేశాన్ని బలోపేతం చేసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పిన మాటలను నేను నూటికి నూరుశాతం ఏకీభవిస్తున్నా, వందకు వందశాతం నాయకులంతా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరుకుంటున్నా అని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.