– దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని
– దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు వరద సహాయక చర్యల నిమిత్తం రూ. 50వేల రూపాయల విరాళాన్ని అందించిన పెదపాడు మండలం సత్యవోలు రైతులు
– అభినందించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని
పెదవేగి: ఒక వరి గింజ పండించటం కోసం ఎంతో కాలం కష్ట పడే రైతులకు కష్టం యొక్క విలువ తెలుసు కాబట్టే, రైతులు సైతం కూటమి ప్రభుత్వం తరఫున వరద సహాయక చర్యల్లో తమ వంతు భాగస్వామ్యం అవుతున్నారని, వరద సహాయక చర్యల నిమిత్తం స్వచ్ఛందంగా తరలి వచ్చి విరాళాలు అందిస్తున్న ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా అభినందిస్తునట్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నీ పలువురు కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించారు.
నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు.
పెదపాడు మండలం సత్యవోలు గ్రామానికి చెందిన రైతులు , ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని, క్యాంపు కార్యాలయంలో కలిసి వరద సహాయక చర్యల నిమిత్తం రూ.50 వేల రూపాయల విరాళాన్ని అందచేసారు.
ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ.. వరద సహాయక చర్యల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎంతో అండగా నిలిచిందని, దెందులూరు నియోజక వర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి వరద వల్ల నష్ట పోయినా ప్రజలకు తమ సేవలు అందించారని అన్నారు. వరద సహాయక చర్యల కోసం పెదపాడు మండలం సత్యవోలు గ్రామ రైతులు రూ.50 వేలు విరాళం అందించటం ఎంతో అభినందనీయం అని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ (మిల్లు బాబు), లావేటి శ్రీనివాస్, బొప్పన సుధా, నంబూరి నాగరాజు, పార్టీ నాయకులు తాతా సత్యనారాయణ, ఉప్పలపాటి రాం ప్రసాద్, ఎంపిటిసి నాగరాజు, రావడి గాంధీ సహా పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.