– సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా
సత్తెనపల్లి, మహానాడు: మన దేశం గొప్ప ప్రజాస్వామ్య దేశమని, ఇందుకు కారణం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణమే కారణమని మాజీ మంత్రి, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పట్టణ మునిసిపల్ కార్యాలయం వద్ద గురువారం జరిగిన 78వ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా మహాత్మా గాంధీ కన్న కలలకు అనుగుణంగా రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఎందరో మహానుభావులు, వారి త్యాగ ఫలితమే నేటి స్వచ్ఛా స్వాతంత్య్రాలని పేర్కొన్నారు. అనంతరం మునిసిపల్ కార్యాలయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిల చిత్ర పటాలను స్వయంగా కన్నా లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా నియోజకవర్గ, పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.