సమస్యలను అధిగమించి ప్రగతిని సాధించాలి

అధికారులకు దిశా నిర్దేశం 
పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు

నరసరావుపేట, మహానాడు:  వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న సమస్యలను అధిగమించి, ప్రగతిని సాధించాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు జిల్లా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక” పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి  అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రద్ద, అంకిత భావంతో పనిచేసి జిల్లాను ఉన్నత స్థానంలో నిలపాలన్నారు. అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం వహించినా  సహించేది లేదని ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు, జిల్లాలో దృష్టి సారించాల్సిన అంశాలపై శ్రద్ద వహించాలని ఆయన సూచించారు. జిల్లాలో ఎటువంటి బాధాకర సంఘటనలు జరగకుండా కార్యాచరణ, ప్రణాళిక రూపొందించుకొని పనులు చేపట్టాలని చెప్పారు.

జిల్లాలోని మండలాల ప్రత్యేక అధికారులు వారానికి ఒక్కరోజు సచివాలయాలు, పాఠశాలలు, హాస్టల్లో, రైతు సేవా కేంద్రాలు, ప్రభుత్వాసుపత్రులు తనిఖీలు చేసి, సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీఆర్డీఏ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.