-కూటమి విజయం నేపథ్యంలో తెదేపా అభిమానుల మొక్కు
-స్వాగతం పలికిన మహానాడు మీడియా ఎండీ
వినుకొండ, మహానాడు: తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించిన నేపథ్యంలో తెలుగుదేశం అభిమానులు గుంటూరు నుండి శ్రీశైలానికి కాలినడకన బయలుదేరారు. ఈ బృందం వినుకొండ చేరుకున్న సందర్భంగా మహానాడు మీడియా ఎండి బోడేపూడి వెంకట సుబ్బారావు, వినుకొండ మండల తెలుగుదేశం నాయకులు, నడిగడ్డ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వారికి సాదరంగా స్వాగతం పలికి, జేజేలు పలికారు.
గుంటూరు నుండి శ్రీశైలానికి పాదయాత్రకు బయలుదేరిన వారిలో తెలుగుదేశం పార్టీ అభిమానులు గోరంట్ల సాంబశివరావు,లాం శ్రీధర్, ఘంటా నాగేశ్వరరావు, కాపు నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.
పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం నాయకులకు స్వాగతం పలికిన వారిలో డాక్టర్ బోడేపూడి హనుమయ్య, బోడెపూడి వీరాంజనేయులు, బోడేపూడి ప్రసాదు, నెమలిపురి శ్రీనివాసరావు, బోడెపూడి శ్రీనివాసరావు, బోడెపూడి చంద్రబాబు, దానమూర్తి ఆదాం, మణికంఠ యాదవ్, అత్తులూరి మల్లికార్జునరావు తదితరులు ఉన్నారు.